గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. ఆగస్టు 15 న గోల్కొండ కోటలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురువేయనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వజ్రోత్సవాలను పురస్కరించుకుని పంద్రాగస్టు వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించుకుంది.

ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారని చెప్పారు. దాదాపు వెయ్యి మంది కళాకారులతో స్వాగత ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు సీఎస్.

ఇక ప్రతియేడాది ఆగస్టు 15 వ తేదీన మనమందరము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది మనం 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి.

SHARE