ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందే – నారాయణ

ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు సిపిఐ నేత నారాయణ. తెలంగాణ – ఏపీ మధ్య ఇప్పుడు ఐదు గ్రామాల గొడవ నడుస్తుంది. కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక గ్రామాల పంచాయితీలు గోదావరి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఈ ఐదు గ్రామాలు ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలోకి వస్తాయి. రంపచోడవరం 120కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఎనిమిదేళ్లుగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు.

ఇప్పటికే ఏపీ సర్కార్ కు తెలంగాణాలో కలాపాలతు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సర్కార్ కూడా ఈ గ్రామాలను తెలంగాణ లో కలిపితే కరకట్ట నిర్మాణం చేపడతామని చెపుతుంది. ఈ క్రమంలో దీనిపై సీపీఐ నారాయణ స్పందించారు. ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిం దేనని ప్రకటించారు. ఈ 5 గ్రామాలను తెలంగాణ లో కలుపదానికీ అభ్యంతరం లేదని చంద్ర బాబు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నప్పుడే రెండు రాష్ట్రాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందని.. కాపాడాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవటానికే రెండు ప్రభుత్వాలు ఉద్దేశ్యం పూర్వకంగానే ప్రవర్తిస్తున్నాయని నిప్పులు చెరిగారు. మునిగిన ప్రాంతాలు కాపాడుకోవడం విస్మరించి రెండు రాష్ట్రాల మంత్రులు ఉద్దేశ్య పూర్వకంగానే విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు.

SHARE