ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు, కార్యకర్తలపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 341, 148, 353, 332, 147, 509, 149 కింద పోలీసులు కేసు నమోదు చేసారు. బంజారాహిల్స్‌ రోడ్‌ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సోమవారం బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.

బీజేపీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది.

SHARE