హైదరాబాద్ బండ్లగూడలోని ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో.. కన్నుల పండుగగా జరిగింది. సార్వజనికోత్సవంలో శిక్షార్ధుల ఘోష్, కర్రసాము, కరాటే, యోగ్‌చాప్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవేశ్ శిక్షా వర్గలో భాగంగా శిక్షార్ధులకు కర్రసాము, నియుద్ధ, యోగ్‌చాప్ అంశాల్లో శిక్షణ నిచ్చారు. బౌద్ధిక్ కార్యక్రమాల్లో భాగంగా అనేక సామాజిక అంశాలపై లోతుగా అవగాహన కల్పించారు. సార్వజనికోత్సవానికి పలువురు మేధావులు, విద్యావేత్తలు, రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన వక్తగాఇంకా చదవండి …

బేగంబజార్‌ పరువు హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్‌ పర్వాన్‌‌ను హత్య చేసిన ఐదుగురు నిందితులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం కర్నాటకకు పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో నీరజ్‌పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. నీరజ్‌ పన్వార్‌ను దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచి చంపారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోవడంతో యువకుడిపై యువతిఇంకా చదవండి …

ప్రియుడితో ఓ జవాన్‌ భార్య రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన నగరంలోని రహమత్‌నగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. రహమత్‌నగర్‌ పరిధిలో ఉంటున్న జవాన్‌ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రియుడినే భర్తగా పరిచయం చేసి ఆమె ఇల్లు అద్దెకు తీసుకుంది. అకస్మాత్తుగా ఇంటికొచ్చిన జవాన్‌.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఇంట్లోనే ఉంచి తాళం వేసిన జవాన్‌.. భార్య, ఆమె ప్రియుడిపైఇంకా చదవండి …

కొంతమంది హోటల్ సిబ్బంది తమ హోటల్ కు వచ్చే కస్టమర్లపై అధిక వసూళ్లు చేసి జేబులు నింపుకుంటుంటారు. MRP ధరలే తీసుకోవాలని నిబంధనలు ఉన్న వాటిని వదిలేసి..MRP కంటే అధికంగా వసూళ్లు చేస్తుంటారు. ఆలా వారు చెప్పినదానికి ఇస్తుంటారు. కానీ చెప్పినదానికన్నా మరింత వసూళ్లు చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. తాజాగా హైదరాబాద్ తిలక్‌నగర్‌ లోని ఓ హోటల్ ఓనర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు వంశీ అనే యువకుడు.ఇంకా చదవండి …

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వనగరం తీర్చిదిద్దేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గరంలోని పీపుల్స్ ప్లాజా వ‌ద్ద చెత్త త‌ర‌లించే 40 అత్యాధునిక వాహ‌నాల‌ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ న‌గ‌రంలో అయినా రెండు ముఖ్య‌మైన వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయి. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వ‌చ్ఛ తెలంగాణ, స్వ‌చ్ఛ హైద‌రాబాద్ఇంకా చదవండి …

ప్రభుత్వ రంగంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. వ‌ర‌ల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో… సిటీ స్కాన్‌, డెంటల్ ఎక్స్‌రే ఓపీజీ, పెషేంట్ అటెండెన్సీ భ‌వ‌నంతో పాటు మొబైల్ స్క్రీనింగ్ వాహ‌నాన్ని ఆయన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ విభాగంలోకి తీసుకువచ్చిన క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ప్రతి ఏడాది 100 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేస్తోంద‌ని తెలిపారు.ఇంకా చదవండి …

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక విమానంలో నగరానికి రానున్న ఆయన హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు చేరుకుంటారు. అక్కడ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం ఇక్రిశాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు చేరుకుంటారు. అక్కడ రామానుజార్యుల భారీ విగ్రహావిష్కరణలో పాల్గొని 8 గంటల సమయంలోఇంకా చదవండి …

హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించేందుకు వచ్చిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థూపం వద్దకు వెళ్లకుండా అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆప్ నాయకులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రాజా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడని ఆరోపించారు.ఇంకా చదవండి …

ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు. .గుంటూరు ఆయన స్వస్థలం. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ హిందూ స్మశాన వాటికలో రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా చదవండి …

హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ లతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఓ దుండగుడు ఇల్లు అద్దెకు కావాలని వచ్చి మహిళ మెడలోంచి గొలుసు దొంగతనానికి యత్నించాడు. మెడపై కత్తి పెట్టి బంగారు గొలుసు తెంపుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన మహిళ ప్రతిఘటించడంతో కత్తితో రెండు కాళ్లను గాయపరిచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుఇంకా చదవండి …