హీరో లుక్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..

టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..హీరో లుక్ లో కనిపించాడు. నిత్యం ఖద్దరు వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించే శ్రీనివాస్ గౌడ్ తాజాగా రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌, బ్లూ క‌ల‌ర్ జీన్స్‌, భుజంపై బ్లేజ‌ర్ వేసుకుని హీరోకు ఏమాత్రం తగ్గకుండా కనిపించి ఆకట్టుకున్నాడు. దీనికి సంబదించిన వీడియో , ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

ఎక్క‌డికెళుతున్నారో తెలియ‌దు గానీ… ఓ గంట క్రితం ఓ విమానంలో క‌నిపించిన శ్రీనివాస్ గౌడ్‌… మ‌రికాసేప‌టికే ఎక్క‌డో మెట్రో రైల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌, బ్లూ క‌ల‌ర్ జీన్స్‌, భుజంపై బ్లేజ‌ర్ వేసుకుని క‌నిపించారు.

ఇలా సినిమా హీరో లుక్కులో క‌నిపిస్తున్న త‌న ఫొటోలు, వీడియోను శ్రీనివాస్ గౌడే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన ప్ర‌యాణంలో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన రెజ్ల‌ర్ ర‌వి కుమార్ ద‌హియాతో క‌నిపించారు. ఆ తర్వాత మెట్రో లో కనిపించారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనేది పక్కన పెడితే ఆయనకు సంబదించిన తాజా లుక్ మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

SHARE