వరద బాధితులకు బట్టలు, నిత్యావసర సరుకులను పంపిణి చేసిన గవర్నర్ తమిళి సై

వరద బాధితులకు బట్టలు, నిత్యావసర సరుకులను పంపిణి చేసారు తెలంగాణ గవర్నర్ తమిళి సై . 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై కోరారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు గవర్నర్‌ తెలిపారు. హర్ ఘర్ తిరంగలో భాగంగా రాజ్ భవన్ లోని శానిటరీ గార్డెన్ కార్మికులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు.

దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. దేశభక్తికి చిహ్నంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రజలను కోరారు. మరోపక్క సీఎం కేసీఆర్ సైతం ప్రగతి భవన్ లో స్వాతంత్ర్య భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల‌పై సమీక్ష జరిపారు. వ‌జ్రోత్స‌వ వేడుకల కార్యాచరణను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే.

SHARE