జగిత్యాల జిల్లా మల్యాలలో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పేదలకు బాసటగా నిలుస్తున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు అన్నారు. ఇప్పటికీ రెండు సార్లు ధరలు తగ్గించారని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి పాలాభిషేకం చేసిన వారిలో ఎంపీటీసీ రాచర్ల రమేష్,ఇంకా చదవండి …

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు బుధువారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్‌ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్‌ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్‌ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటె మంత్రి రాక సందర్బంగా నగరవ్యాప్తంగా నేతలు ప్లెక్సీ లతోఇంకా చదవండి …

రోగం నయం కావాలని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కొత్త రోగం అంటుకుంది. అది కూడా ఎలుకల వల్ల. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఇదే జరిగింది. నాలుగు రోజుల క్రితం భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఆస్పత్రిలో చేరిన మొదటి రోజే శ్రీనివాస్ ను ఎలుకలు కరిచాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈరోజు ఉదయంఇంకా చదవండి …

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రజలతో పాటు… రైతులనూ కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొనలేదంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. ధాన్యం సరఫరా చేయలేమని… స్వయంగా తమే విక్రయించుకుంటామని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇప్పుడేమో కేంద్రంపై తాడోపేడో అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.ఇంకా చదవండి …