బర్త్ డే వేడుకలకు కేటీఆర్ దూరం..

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు రేపు. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు , పార్టీ కార్యకర్తలు , అభిమానులు బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా జరపాలని అనుకున్నారు. కానీ ఎలాంటి వేడుకలు జరపకూడదని కేటీఆర్ ఆదేశించారు. జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఆయన తెలిపారు.

వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని… పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బర్త్ డే వేడుకలను ఆకాశాన్ని తాకేలా ఏర్పాటు చేయాలనీ టీఆర్ఎస్ యువనేత, మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ భావించారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాట్లు సైతం పూర్తియ్యాయి. కానీ ఇప్పుడు కేటీఆర్ పిలుపుతో ఆ వేడుకలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

SHARE