పోలవ‌రం ప్రాజెక్టు ఫై కీలక వ్యాఖ్యలు చేసిన ర‌జ‌త్ కుమార్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గొడవ నడుస్తుంది. తాజాగా వచ్చిన గోదావరి వరదలకు భద్రాచలం లోని పలు ప్రాంతాలతో పాటు చాల గ్రామాలు నీటమునిగాయి. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్లే ఇలా జరిగిందని టీఆరఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని లేదంటే భద్రాచలం కు పెను ప్రమాదం రాబోతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఏపీ మంత్రులు మాత్రం టిఆర్ఎస్ నేతల మాటలను వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్..పోలవ‌రం ప్రాజెక్టుతో ల‌క్ష ఎక‌రాల భూమితో పాటు భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల సైతం మునిగిపోతాయ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ర‌జ‌త్ కుమార్ బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎస్సారెస్పీ, క‌డెం, కాళేశ్వ‌రం ప్రాజెక్టులు, భ‌ద్రాచ‌లంకు వాటిల్లిన ముప్పు, భ‌ద్ర‌తా అంశాల‌పై ర‌జ‌త్ కుమార్ స‌మీక్షించారు. క‌డెం ప్రాజెక్టుకు ఇటీవ‌లే మ‌ర‌మ్మ‌తులు చేయ‌డంతో.. ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌న్నారు. గ‌డిచిన 100 ఏండ్ల‌లో ఎప్పుడూ లేని విధంగా క‌డెం ప్రాజెక్టు ఎగువ‌న భారీ వ‌ర్షం కురిసింద‌ని తెలిపారు.

SHARE