నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై మరో కేసు నమోదు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను దుర్భాషలాడనని, పరుష పదజాలంతో దూషించను అని అరవింద్ ప్రకటన చేసిన తరువాత, ఇప్పుడు తాజాగా ఆయన పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల‌ను రెచ్చగొట్టే విధంగా ఎంపీ అర‌వింద్ వ్యాఖ్యానించార‌ని అడ్వ‌కేట్ ర‌వి కుమార్.. స‌రూర్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అరవింద్ ధర్మపురిపై ఐపిసి సెక్షన్ 504 మరియు 505 (1) (సి) కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించడానికి, అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ధర్మపురి అరవింద్ ను, గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు గ్రామానికి వచ్చారు అంటూ నిలదీశారు గ్రామస్తులు.

SHARE