నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక విద్యానగర్ కాలనీలో ఓ ఇంట్లో వాళ్ళు పెళ్లికి వెళ్లిన విషయాన్ని పసిగట్టిన దొంగలు.. ఇంట్లోకి ప్రవేశించి లక్ష నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని వన్ టౌన్ పోలీసులు చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇంకా చదవండి …

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్థి పంజరాలు కలకలం రేపాయి. పాఠశాల మైదానాన్ని చదును చేసేందుకు గ్రామ సర్పంచ్.. స్మశాన వాటికలోని మట్టిని తీసుకొచ్చి పోయించాడు. ఆ మట్టిలో పుర్రె, కాళ్ల ఎముకలు భయటపడటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలపడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఇంకా చదవండి …