తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రం మొత్త్తం తడిసిముద్దవుతోంది. గత వారం మొత్తం భారీ వర్షాలు పడగా..ఆ తర్వాత రెండు రోజులు కాస్త ఎండలు కొట్టాయో లేదో మళ్లీ వర్షాలు అందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇంకా చదవండి …