పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పంప్‌హౌస్‌లోకి క్రేన్‌ దించుతుండగా..క్రేన్‌ వైరు తెగిపోవడం తో ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు క్రేన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన ఆవేదన కలిగించిందని అన్నారు.ఇంకా చదవండి …