కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌స్తే ఆయ‌న‌కే మునుగోడు టికెట్ ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ త‌ర‌ఫున రాజ‌గోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇవ్వ‌డంతో పాటుగా సీనియ‌ర్ నేత‌లంతా క‌లిసి ఆయ‌న‌ను మునుగోడు ఉప ఎన్నిక‌లో గెలిపించుకుంటామ‌ని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇంకా చదవండి …

మునుగోడు ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత రాజగోపాల్ ఈ నెల 21 న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బిజెపి లో చేరబోతున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో చేరబోయేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ లో బిజెపి నేత వివేక్‌తోపాటు ఆయన.. అమిత్‌ షాను కలిశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఇంకా చదవండి …