క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ తో పాటు అతడి గ్యాంగ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్‌ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇంకా చదవండి …