కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 5 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వాలు పోటీప‌డుతున్నారు. సాయంత్రం దేశానికి కొత్త ఉపాధ్యక్షుడి పేరును రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు ఓటేసేందుకు పోటెత్తారు.

80 ఏళ్ల వయసున్న మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకురాలు . రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్‌ రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు. మార్గరెట్‌ ఆల్వాకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్‌, ఆప్‌ మద్దతు తెలుపుతున్నాయి. జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ఎన్డీఏ పక్షాల అభ్యర్థి జగదీప్ దన్కర్ కు వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, ఏఐఎడిఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్జెపి మద్దతు తెలిపారు.

SHARE