కదులుతున్న వ్యాన్‌లో కరెంట్ షాక్.. 10 మంది మృతి

బంగాల్​లోని కూచ్​ బెహార్​లో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వినోదం కోసం వ్యాన్​లో ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్.. 10 మంది ప్రాణాలు తీసుకుంది. సీతల్​కుచి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 27 మంది వ్యాన్​లో ఆదివారం జల్పేశ్​కు వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలు దాటాక ఒక్కసారిగా వాహనం అంతటా విద్యుత్ సరఫరా జరిగింది. ఏమైందో తెలిసేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.”వాహనం వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్​ జనరేటర్ వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. వ్యాన్​ను సీజ్ చేశాం. కానీ డ్రైవర్ పరారయ్యాడు.” అని చెప్పారు మాతాభంగా ఏఎస్​పీ అమిత్ వర్మ. ప్రమాద సమయంలో వ్యానులో మొత్తం 27 మందికి ఉండగా.. పది మంది ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారని.. మరో 16 మంది జయపాయి గుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

SHARE