పార్లమెంట్​ ఆవరణలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యులు

సస్పెన్షన్​కు గురైన 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్​ ఆవరణలో 50 గంటల దీక్షకు దిగారు. వీరంతా కూడా రాత్రంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. బుధవారం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్‌, చికెన్‌ తండూరీని తృణమూల్‌ సమకూర్చింది.

గురువారం అల్పాహారాన్ని డీఎంకే, మధ్యాహ్న భోజనాన్ని టిఆర్ఎస్, రాత్రి భోజనాన్ని ఆప్‌ పంపించనున్నాయి. నిరసనలో కూర్చున్నవారికి మద్దతుగా వంతుల వారీగా కొంతమంది విపక్ష సభ్యులు శిబిరం వద్దకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. దీనికోసం వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ టెంట్‌ వేయడానికి పార్లమెంటు వర్గాలు అనుమతించలేదు. ఆరుబయటే వారంతా విశ్రమించారు. ధరల పెరుగుదలపై చర్చించాలని విపక్ష పార్టీలు ఆందోళన చేస్తుండడం తో స్పీకర్ 20 మంది రాజ్య సభ సభ్యులను సస్పెన్షన్​ చేయడం జరిగింది.

SHARE