రేపు ఈడీ ముందుకు సోనియా ..

రేపు ఈడీ ముందుకు సోనియా గాంధీ హాజరుకాబోతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సోనియాను విచారించబోతున్నారు. ఈ కేసులో జూన్​ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో ఆమెకు జులై 21 న హాజరు కావాలని ఈడీ నోటీసు జారీ చేసారు. ఈ క్రమంలో రేపు ఆమె ఈడీ ముందుకు రాబోతున్నారు.

సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైంది. మోడీ సర్కారు దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని ఆరోపిస్తున్న నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు నిర్ణయించారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.

సోనియా తనయుడు, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని ఇదే కేసు విషయంలో.. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది.

SHARE