సోనియా ను విచారిస్తున్న ఈడీ అధికారులు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు సోనియాను విచారిస్తున్నారు. గురువారం 12 గంటల ప్రాంతంలో సోనియా ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు సాయంగా వెళ్లేందుకు ప్రియాంకకు అనుమతిచ్చింది ఈడీ. కాకాపోతే.. విచారణ గదిలో కాకుండా మరో రూంలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీసు వరకు సోనియా, ప్రియాంక వెంట రాహుల్ గాంధీ వెళ్లారు. విచారణ కోసం ఆఫీస్ కు వెళ్లగానే అక్కడ్నుంచి రాహుల్ గాంధీ రిటర్న్ అయ్యారు. ఇక మూడు సెషన్లలో ఐదుగురు అధికారులు సోనియాగాంధీని ప్రశినిస్తున్నారు. ఫస్ట్ సెషన్ లో పర్సనల్ డీటైల్స్, సెకండ్ సెషన్లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి.. థర్డ్ సెషన్లో కాంగ్రెస్ పార్టీతో యంగ్ ఇండియన్ గురించి అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇదిలా ఉంటె సోనియాగాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు బయట, లోపల కూడా నిరసలు జరిగాయి. సోనియా గాంధీకి మద్దతుగా ఈడీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అధికారులు అరెస్టు చేశారు. సోనియాగాంధీ ఈడీ విచారణ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను పెంచారు. అలాగే హైదరాబాద్ లోను పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ కేసులో జూన్​ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో ఆమెకు జులై 21 న హాజరు కావాలని ఈడీ నోటీసు జారీ చేసారు. ఈ క్రమంలో సోనియా ఈడీ ముందుకు హాజరయ్యారు.

SHARE