భారీ వ‌ర్షాల‌కు కూలిన చ‌క్కి రైల్వే బ్రిడ్జ్‌

వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో నదులు ఉగ్ర రూపం దాల్చాయి. కాంగ్రా, చంబ్ర, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్రి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. వరద తీవ్రతకు కాంగ్రా జిల్లాలోని చక్రి నదిపై ఉన్న రైల్వే వంతెన శనివారం కుప్పకూలిపోయింది.

శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉద‌యం అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం, వ‌ర‌ద వ‌చ్చింది. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 14 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. చంబా జిల్లాలో వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగి ఓ ఇంటిపై ప‌డ్డాయి. ఆ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు. క్లౌడ్‌బ‌స్ట్ కావ‌డంతో బాగీ నుంచి ఓల్డ్ క‌టోలా ప్రాంతంలో ఉన్న ఇండ్ల‌కు చెందిన కుటుంబాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల మండి జిల్లాలో రోడ్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి.

SHARE