కరోనా బారినపడిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రెండోసారి కరోనా బారినపడ్డారు. జూన్ నెలలో మొదటిసారి కరోనా బారినపడి కోలుకున్న ఆమె..మరోసారి కరోనా బారినపడినట్లు తెలిపింది. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు.

ఆ మధ్య ప్రియాంక తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు. మరోపక్క, రాహుల్ గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. వీరు మాత్రమే కాదు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కరోనా బారినపడ్డారు. దీంతో కార్య కర్తల్లో ఆందోళన పెరిగింది.

SHARE