ఒక్క రూపాయి డాక్టర్ మృతి

ఒక్క రూపాయి డాక్టర్ అనగానే టక్కున గుర్తించే వ్యక్తి డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్. దాదాపు 60 ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ లో ఒక్కరూపాయికే ఎంతో మందికి వైద్యం అందించి ‘ఒక్కరూపాయి డాక్టర్‌’ అని పేరుతెచ్చుకున్నారు. అలాంటి డాక్టర్ ఈరోజు మంగళవారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఈయన వయసు 84 ఏళ్లు.

1984లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై బోల్పోర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగానూ గెలిచిన ఈయన ప్రజలకు సేవలు అందించారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. ఆ పార్టీకీ గుడ్‌బై చెప్పి ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చారు. 2020లో సుశోవన్ బెనర్జీ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించింది. అదే ఏడాదిలో అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డుల్లోకెక్కింది. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం పట్ల అంత దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక సుశోవన్‌ బందోపాధ్యాయ్‌ మృతి పట్ల ప్రధాని మోడీ, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. డాక్టర్‌ సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ ఎంతో మందికి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడిగా, విశాల హృదయం కలిగిన వ్యక్తిగా ప్రజలకు గుర్తుండిపోతారని మోడీ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.

SHARE