దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు – ముకేశ్ ప్రకటన

దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని ముకేశ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో జియో అన్ని పట్టణాలకు విస్తరిస్తుంది. జియో ట్రూ 5జీ నెట్వర్క్ విస్తరించేందుకు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించారు.

SHARE