గుజరాత్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ ఈరోజు గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుందని తెలిపారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ వల్ల పాల ఉత్పత్తులు మరింత పెరిగి… గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుందని చెప్పారు.

SHARE