మమతా బెనర్జీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్రం ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. తమతో పెట్టుకున్న వారెవ్వరూ గెలిచిన దాఖలాల్లేవని…. మరాఠా తర్వాత చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అంటున్నరు. కానీ ఇప్పటికే ఇక్కడ మకాం వేసేందుకు చాలా ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారని తెలిపారు. అయితే ఇక్కడికి రావాలంటే బంగాళాఖాతం దాటాలని దీదీ కామెంట్స్ చేశారు. వచ్చే క్రమంలో అక్కడ ఉన్న మొసళ్లు మిమ్మల్ని కొరికేస్తాయి, జర జాగ్రత్త అని హెచ్చరించారు.

టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థఛటర్జీని భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు ఈడీ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఆమె ప్రశ్నించారు. కమాండ్ హాస్పిటల్‌కు తరలించడంపై మీ ఉద్దేశం ఏంటి..? ఇది బెంగాల్ ప్రజలను అవమానించడం కాదా అంటూ ఆగ్రహించారు. మీ దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వాలు దొంగలా.. రాష్ట్రాల వల్లే మీరు కేంద్రంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. దేశ రాజకీయాల గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బెంగాల్‌లో అధికారం చేజిక్కుంచోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆమె ఆరోపించారు. ” ఇక్కడికి రావడానికి మీరు ప్రయత్నించొద్దు. ఇక్కడకు రావాలంటే.. బంగాళాఖాతం దాటాలి, అక్కడ మొసళ్లు మిమ్మల్ని కొరికేస్తాయి. సందర్‌బన్స్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మీపై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంటుంది. ఉత్తర బెంగాల్‌లో ఏనుగులు మీపైకి దూసుకొస్తాయి” అంటూ దీదీ బీజేపీకి హెచ్చరికలు పంపింది.

తాను ఎవరినీ విడిచిపెట్టనని, దొంగలను, దోపిడీదారులను TMC వారిని విడిచిపెట్టదని మమతా బెనర్జీ తెలిపారు. ఆ విషయానికొస్తే తాను స్వంత వ్యక్తులను కూడా అరెస్టు చేపించామని…. మా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

SHARE