మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ..కొత్తగా 18 మంది ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది రాజభవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంత్రులతో గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి నుంచి 9, శివసేన నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రమాణం చేయించారు.

బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధాకృష్ణ పాటిల్, రవీందర్ చౌహన్, మంగళ్ ప్రభాత్, విజయ్ కుమార్, అతుల్ సవే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక శివసేన నుంచి దాదా బహుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, అబ్దుల్ సత్తర్, ఉదయ్ సమంత్, గులాబ్ రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, సందీపన్, తానాజీ సవంత్ మంత్రలుగా ప్రమాణం చేశారు.

మంత్రివర్గ విస్తరణకు ముందు షిండే, బీజేపీ నాయకత్వం మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి షిండే చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు చూస్తుంటే ఇటు షిండే వర్గంలోని ఎమ్మెల్యేల్లో, బీజేపీ ఎమ్మెల్యేల్లో విమర్శలకు తావులేకుండా సమతుల్యతతో మంత్రి వర్గంలో రెండు వర్గాలకు స్థానం కల్పించారు.

SHARE