యూపీలో పిడుగుపాటుకు 14 మంది మృతి

యూపీలో విషాదం అల్లుకుంది. పిడుగుపాటుకు 14 మంది మృతి చెందగా , 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బాందా నుంచి నలుగురు, ఫతేపుర్​ నుంచి ఇద్దరు, బల్​రాంపుర్​, ఛందౌలి, బులంద్​శహర్​, రాయ్​ బరేలీ, అమేఠీ, కౌశాంబి, సుల్తాన్​పుర్​, చిత్రకూట్​ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్‌, చందౌలీ, బలుందర్‌శహర్‌, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్‌, చిత్రకూట్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్‌. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు

SHARE