రామ్​నాథ్ కొవింద్ వీడ్కోలు సభ కు వెళ్లలేకపోతున్న పవన్ కళ్యాణ్

రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్​నాథ్ కొవింద్ వీడ్కోలు సభ రేపు ఢిల్లీ లో అట్టహాసంగా జరగనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు ఆహ్వానం అందింది. కాగా.. తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చరిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లలేకపోతున్నానని పవన్ ప్రకటన విడుదల చేశారు.

రామ్​నాథ్ కొవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించటం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఆయన తన సేవలను నిర్విరామంగా నిర్వర్తించాలని,ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను సభకు ఆహ్వానించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటె భారత 15 రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేత‌ల సంబ‌రాల‌కైతే హ‌ద్దే లేకుండా పోయింది. పెద్ద ఎత్తున సంబ‌రాల‌ను జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేత‌లు క్యూ క‌ట్టారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి వారు ఆమె నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.

SHARE