రేపు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్..

రేపు (జులై 21) రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. దీనికి సంబదించిన ఏర్పట్లన్నీ పూర్తి చేసారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు హాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత బ్యాలెట్ పేపర్లను క్రమపద్దతిలో అమర్చనున్నారు.

అనంతరం రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను వేరు చేసి టేబుల్పై ఉన్న ట్రేలలో పెడతారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు.

ఈ నెల 18 న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. ఆమె 63 శాతానిపైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం.. క్రాస్ ఓటింగ్ జరిగితే మెజార్టీ మరింత పెరిగే ఛాన్సుంది. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

SHARE