రాజ్యసభ సభ్యుడిగా ఇళయరాజా పదవీ ప్రమాణం

ప్రఖ్యాత సంగీతకారుడు, భారతీయ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఇటీవలే ఇళయరాజా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడి గా ప్రమాణ స్వీకారం చేసి స‌రికొత్త ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. పార్ల‌మెంటు వ‌ర్షాకా‌ల స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం రాజ్య‌స‌భలో డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌ ఆయ‌న చేత రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఇళ‌య‌రాజాతో పాటు తెలుగు సినీ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, కర్ణాట‌క‌కు చెందిన సామాజిక‌వేత్త వీరేంద్ర హెగ్గడే, కేర‌ళ‌కు చెందిన ప‌రుగుల రాణి పీటీ ఉష‌ల‌ను ఇటీవ‌లే కేంద్రం రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో ఇప్ప‌టికే విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, పీటీ ఉష‌లు ప్ర‌మాణం చేయ‌గా.. సోమ‌వారం ఇళ‌య‌రాజా ప్ర‌మాణం చేశారు.

SHARE