కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్‌

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చారు గులాం నబీ ఆజాద్‌. జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా అధిష్టానం గులాం నబీ ఆజాద్‌ నియమించగా..దానికి ఆయన నో చెప్పాడు. అంతే కాదు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలె రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నందున.. జమ్మూకశ్మీర్‌కు పరిమితం చేయటం తన హోదాను తగ్గించినట్లు అవుతుందని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు.. ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన గులామ్‌ అహ్మెద్‌ మిర్‌.. జమ్ము కశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ ఆజాద్‌ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవటం సైతం ప్రాధాన్యం సంతరించుకుంది.

SHARE