కొనసాగుతున్న సోనియా ఈడీ విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జులై 21 న దాదాపు మూడు గంటల సేపు విచారించిన అధికారులు..ఈరోజు మరోసారి ఆమెను విచారిస్తున్నారు. ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య సోనియాగాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు ర్యాలీ చేప‌ట్టారు. విప‌క్ష నేత‌ల్ని బీజేపీ వేధిస్తోంద‌ని డీకే శివ‌కుమార్ ఆరోపించారు.

ఈ కేసులో జూన్​ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో ఆమెకు జులై 21 న హాజరు కావాలని ఈడీ సూచించడంతో హాజరయ్యారు. ఈరోజు కూడా సోనియా ను విచారిస్తున్న అధికారులు ఎన్ని గంటలు విచారిస్తారో..ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో..చూడాలి.

SHARE