స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రం పలు సూచనలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రం పలు సూచనలు జారీచేసింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు సూచనలు జారీచేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎక్కువ మందితో సమావేశాలు జరపకూడదని సూచించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ ప్రదేశంలో నెల పాటు స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత్’ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చెట్ల నాటే కార్యక్రమాలను చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలను హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇక ప్రతియేడాది ఆగస్టు 15 వ తేదీన మనమందరము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది మనం 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది.

1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా.. ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము.

SHARE