మరోసారి కరోనా బారినపడిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​కు మరోసారి కరోనా బారినపడ్డారు.గత నాల్గు రోజులుగా విపరీతమైన జ్వరం తో బాధపడుతున్న నితీశ్ కుమార్..కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. డాక్టర్స్ సూచన మేరకు ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నరని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మధ్య తనను కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని నితీశ్ కుమార్ సూచించారు.

జ్వరం కారణంగా నితీశ్ కుమార్ గత కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కాగా, నితీశ్ కరోనా పాజిటివ్ గా తేలడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఆయనకు వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో అప్పుడు కూడా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి కోలుకున్నారు.

SHARE