ఆగస్టు నెలలో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు

కొత్త నెల వచ్చిందంటే బ్యాంకు ఖాతాదారులు ముందుగా చూసేది ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయి..ఏ రోజు ఓపెన్ అవుతుంది..ఏ రోజు క్లోజ్ అవుతుంది.. మొత్తం నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి అనేది తెలుసుకుంటారు. దానిని బట్టి వారు బ్యాంకు పనులు చూసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ హాలిడే లిస్ట్‌ను విడుదల చేయబోతుంది. దీని ప్రకారం.. ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, జన్మాష్టమి వంటివి ఉన్నాయి. ఇంకా శనివారం, ఆదివారాలతో కలుపుకొని వచ్చే నెలలో బ్యాంకులు మొత్తంగా 13 రోజులు పని చేయవు. అయితే ఇక్కడ సెలవులు అనేవి రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. జాతీయ సెలవులు, పండుగలు వంటి వాటి కారణంగా బ్యాంకులకు సెలవులు లభిస్తూ ఉంటాయి. ఏ ఏ రోజుల్లో బ్యాంక్స్ పని చేయవో చూద్దాం.

ఆగస్ట్ 1 – ద్రుపక్ షే జి ఫెస్టివల్ (గ్యాంగ్‌టక్)
ఆగస్ట్ 7 – ఆదివారం
ఆగస్ట్ 9 – మొహరం
ఆగస్ట్ 11 – రక్షాబంధన్
ఆగస్ట్ 13 – రెండో శనివారం
ఆగస్ట్ 14 – ఆదివారం
ఆగస్ట్ 15 – ఇండిపెండెన్స్ డే
ఆగస్ట్ 16 – పార్సి న్యూ ఇయర్ (ముంబై, నాగ్‌పూర్‌లో హాలిడే)
ఆగస్ట్ 19 – జన్మాష్టమి
ఆగస్ట్ 21 – ఆదివారం
ఆగస్ట్ 27 – నాలుగో శనివారం
ఆగస్ట్ 28 – ఆదివారం
ఆగస్ట్ 31 – గణేశ్ చతుర్థి

SHARE