సామాన్యులకు మరో షాక్..భారీగా పెరిగిన పాల పాకెట్ ధర

సామాన్యులకు మరో షాక్..ప్రముఖ పాల సప్లయర్లు అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ.రెండు చొప్పున పెంచాయి. గడచిన ఆరు నెలల్లో అమూల్, మదర్ డెయిరీకి ఇది రెండవ పెంపు. ఈ ఏడాది మార్చిలోనూ ఈ రెండు సంస్థలు పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచాయి.

అమూల్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో పాలు, ఇతర పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్​) మంగళవారం గుజరాత్, ఢిల్లీ-–ఎన్​సీఆర్​, వెస్ట్‌‌‌‌‌‌‌‌లోని అహ్మదాబాద్ సౌరాష్ట్రలో పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచాలని నిర్ణయించింది. బెంగాల్, ముంబై, ఇతర మార్కెట్లలో కొత్త ధరలు ఆగస్టు 17 నుంచి అమలులోకి వస్తాయి. లీటరుకు రూ. 2 పెంపు సగటు ఆహార ఇన్​ఫ్లేషన్ కంటే తక్కువేనని అమూల్​ ఒక ప్రకటనలో తెలిపింది.

SHARE