యూపీలో ఘోర ప్రమాదం : 8 మంది మృతి

ఉత్తర్ ప్రదేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో 8 మంది చనిపోగా , 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

రెండు బస్సులు బీహార్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్నాయని … ఒక బస్సును మరో బస్సు ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ప్రమాద ధాటికి బస్సు ఎడమ భాగం మొత్తం ధ్వసంమయింది. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

SHARE