కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌..తాజాగా తాను రాజీనామా చేయడానికి కారణాలు ఏంటో తెలిపి షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తను అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం తొలిసారి ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23ఇంకా చదవండి …

దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయని ముకేశ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ఇంకా చదవండి …

బిహార్‌లో మహా గట్‌బంధన్‌ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్‌ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. రైల్వే ఉద్యోగాల స్కాం కేసులో RJD నేతల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. RJDకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఎంపీల నివాసాల్లో సోదాలు చేపట్టింది. పాట్నాలోని సుబోధ్ రాయ్, సునీల్ సింగ్, అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్ ల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు.ఇంకా చదవండి …

వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో నదులు ఉగ్ర రూపం దాల్చాయి. కాంగ్రా, చంబ్ర, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్రి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. వరద తీవ్రతకు కాంగ్రా జిల్లాలోని చక్రి నదిపై ఉన్న రైల్వే వంతెన శనివారం కుప్పకూలిపోయింది. శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉద‌యంఇంకా చదవండి …

సామాన్యులకు మరో షాక్..ప్రముఖ పాల సప్లయర్లు అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ.రెండు చొప్పున పెంచాయి. గడచిన ఆరు నెలల్లో అమూల్, మదర్ డెయిరీకి ఇది రెండవ పెంపు. ఈ ఏడాది మార్చిలోనూ ఈ రెండు సంస్థలు పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచాయి. అమూల్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో పాలు, ఇతర పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్​) మంగళవారంఇంకా చదవండి …

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చారు గులాం నబీ ఆజాద్‌. జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా అధిష్టానం గులాం నబీ ఆజాద్‌ నియమించగా..దానికి ఆయన నో చెప్పాడు. అంతే కాదు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలె రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగియగా పొడిగింపు దక్కలేదు.ఇంకా చదవండి …

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని, ఎర్రకోటపై 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రధాని మోడీ అన్నారు. త్యాగధనుల పోరాటాల ఫలితమేఇంకా చదవండి …

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రం పలు సూచనలు జారీచేసింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు సూచనలు జారీచేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎక్కువ మందితో సమావేశాలు జరపకూడదని సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ ప్రదేశంలో నెల పాటు స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత్’ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చెట్ల నాటే కార్యక్రమాలను చేపట్టాలనిఇంకా చదవండి …

బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతిఇంకా చదవండి …

విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వరవర రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛనుఇంకా చదవండి …