శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఈరోజు శ్రీలంక పార్ల‌మెంట్‌లో కొత్త అధ్య‌క్షుడి కోసం ఓటింగ్ జరుగగా… ఎన్నిక‌ల్లో మొత్తం 223 ఓట్లు పోల‌య్యాయి. దాంట్లో నాలుగు ఓట్లు చెల్ల‌లేదు. విక్ర‌మ‌సింఘేకు మ‌ద్ద‌తుగా 134 మంది ఎంపీలు ఓటేశారు. దుల్లాస్‌కు 82, దిస‌నాయ‌కేకు మూడు ఓట్లు పోల‌య్యాయి. దీంతో రణిల్ విక్రమ సింఘే నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మాజీ అధ్య‌క్షుడు గోటబయ రాజ‌ప‌క్స దేశం విడిచి వెళ్తూ ప్ర‌ధాని రణిల్‌ విక్ర‌మ‌సింఘేను తాత్కాలిక దేశాధ్య‌క్షుడిగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈరోజు జ‌రిగిన ఎంపీల ఎన్నిక‌ల్లో ఆ దేశ 8వ అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. ఎన్నిక తర్వాత మాట్లాడిన రణిల్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, తమ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు.

SHARE