కాల్పుల్లో గాయపడ్డ జపాన్ మాజీ ప్రధాని షింజో మృతి..

దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జపాన్ మాజీ ప్రధాని షింజో మృతి చెందారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తుండగా..ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని హాస్పటల్ కు తరలించారు. డాక్టర్స్ చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు.

పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్‌కు మీడియా పేర్కొన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న ఛాతిలోకి ఆగంత‌కుడు గ‌న్‌తో కాల్చాడు. ఓ స్టేష‌న్ ముందు నిలుచుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. అబే మాట్లాడుతున్న‌ప్పుడు మొబైల్ ఫోన్‌లో ఓ వ్య‌క్తి ఆ ప్ర‌సంగాన్ని చిత్రీక‌రించాడు. అయితే అబే వెనుక నుంచి తొలుత శ‌బ్ధం వినిపించింది. ఆ త‌ర్వాత తెల్ల‌టి పొగ వ‌చ్చింది. శ‌బ్ధం వినిపించ‌గానే అక్క‌డ ఉన్న జ‌నం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. మొబైల్ వీడియో తీస్తున్న వ్య‌క్తి కూడా షేక‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో 41 ఏళ్ల వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు.

జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు. 2006లో ఆయన తొలిసారిగా జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనారోగ్యంతో 2007లో తన పదవికి రాజీనామా చేశారు. 2012లో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2020 వరకు పదవిలో కొనసాగారు. అదే ఏడాది ఆగస్టులో అనారోగ్య కారణలతో ఏడాది ముందుగానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

SHARE