మెక్సికోలో కూలిన సైనిక హెలికాప్టర్‌

మెక్సికోలో సైనిక హెలికాప్టర్‌ కూలి 14 మంది మృతి చెందారు. మెక్సికోకు వాయువ్య ప్రాంతంలోని సినాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ హెలికాప్టర్‌ లో మొత్తం 15 మంది ఉండగా..వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 14 మంది మృతి చెందారు. సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

మెక్సికలో డ్రగ్‌ కింగ్‌గా పేరొందిన డ్రగ్‌ ట్రాఫికర్‌ రాఫెల్‌ కారో క్వింటెరోను నేవీ అరెస్టు చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే హెలికాప్టర్‌ ప్రమాదానికి, రాఫెల్‌ అరెస్టుకు ఏమైనా సంబంధముందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 1985లో అమెరికాకు చెందిన యాంటీ నార్కోటిక్స్‌ ఏజెంట్‌ హత్య కేసులో డ్రగ్ కింగ్‌ రాఫెల్‌ను నౌకాదళం అదుపులోకి తీసుకున్నది.

SHARE