మంకీపాక్స్​పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఉదృతి పూర్తిగా తగ్గకముందే మరో మహమ్మారి భారత్ లో ప్రవేశించింది. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మంకీపాక్స్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే కేరళలో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రాగా..తాజాగా మంకీపాక్స్​పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. 75 దేశాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ఇంకా చదవండి …

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ కరోనా బారినపడ్డారు. ఈ మేర‌కు గురువారం రాత్రి అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డ్డ బైడెన్‌కు స్వ‌ల్పంగానే వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపిన వైట్ హౌస్‌… ప్ర‌స్తుతం ఆయ‌న అధ్య‌క్ష భ‌వ‌నంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలిపింది. అయితే అక్కడి నుంచే ఆయన తన విధులను నిర్వర్తిస్తారని తెలిపింది. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం ఇప్ప‌టికేఇంకా చదవండి …

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఈరోజు శ్రీలంక పార్ల‌మెంట్‌లో కొత్త అధ్య‌క్షుడి కోసం ఓటింగ్ జరుగగా… ఎన్నిక‌ల్లో మొత్తం 223 ఓట్లు పోల‌య్యాయి. దాంట్లో నాలుగు ఓట్లు చెల్ల‌లేదు. విక్ర‌మ‌సింఘేకు మ‌ద్ద‌తుగా 134 మంది ఎంపీలు ఓటేశారు. దుల్లాస్‌కు 82, దిస‌నాయ‌కేకు మూడు ఓట్లు పోల‌య్యాయి. దీంతో రణిల్ విక్రమ సింఘే నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మాజీ అధ్య‌క్షుడు గోటబయ రాజ‌ప‌క్స దేశం విడిచి వెళ్తూఇంకా చదవండి …

మెక్సికోలో సైనిక హెలికాప్టర్‌ కూలి 14 మంది మృతి చెందారు. మెక్సికోకు వాయువ్య ప్రాంతంలోని సినాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ హెలికాప్టర్‌ లో మొత్తం 15 మంది ఉండగా..వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 14 మంది మృతి చెందారు. సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలుఇంకా చదవండి …

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవుల్లో తలదాచుకున్నాడు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవులకు పరారయ్యారు. భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్‌కు చెక్కేశారు. అక్కడి ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. ప్రజల నిరసనల నేపథ్యంలో రాజీనామాన చేస్తానని గొటబయ ఇప్పటికే ప్రకటించారు. అయితే తనకు గొటబయకు సంబంధించినఇంకా చదవండి …

ట్విట్ట‌ర్ సంస్థ‌ను కొనుగోలు చేయాల‌ని బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. సుమారు 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు దాన్ని ఆయ‌న సొంతం చేసుకోవాల‌నుకున్నారు. అయితే ఆ డీల్ నుంచి మ‌స్క్ త‌ప్పుకున్నారు. ట్విట్ట‌ర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేద‌ని ఆయ‌న ఆరోపిస్తూ డీల్ ను రద్దు చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎలాన్ మస్క్ ఏప్రిల్ 25న 54.20 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసారు.ఇంకా చదవండి …

దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జపాన్ మాజీ ప్రధాని షింజో మృతి చెందారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తుండగా..ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని హాస్పటల్ కు తరలించారు. డాక్టర్స్ చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగాఇంకా చదవండి …

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తుండగా..ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్‌కు మీడియా పేర్కొన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న ఛాతిలోకి ఆగంత‌కుడు గ‌న్‌తోఇంకా చదవండి …

ఆటా సభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత బిజెపి ఫై నిప్పులు చెరిగారు.. తాజాగా అమెరికాలో ఆటా (అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌) మహాసభలు జరిగాయి. ఈ సభల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ విభాగం తరఫున వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ శాఖల పనితీరును వివరించారు.ఇంకా చదవండి …

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. అయితే, ఇటీవల పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు భారీగా సంభవిస్తున్నాయి. రోడ్ల నిర్వహణ సరిగ్గాఇంకా చదవండి …