విజయ్ దేవరకొండ ను శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నారని అడిగిన కరణ్..

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా ‘కాపీ విత్ కరణ్‌’ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షో తాజా సీజన్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ షో కు లైగర్ హీరో విజయ్ దేవరకొండ..అలాగే అనన్య పాండే హాజరయ్యారు.

ఎప్పటిలాగానే కరణ్…ఈ షో లో పలు రొమాంటిక్ , సెన్సేషనల్ ప్రశ్నలు అడిగి వారినుండి సమాదానాలు రాబట్టారు. దీనికి సంబదించిన ప్రోమో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. ఇందులో అనన్య, ఆదిత్యారాయ్ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని గురించి కరణ్ మాట్లాడుతూ.. నీకు, ఆదిత్యారాయ్‌కి మధ్యలో ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. అయితే.. సమాధానం చెప్పడానికి అనన్య సందేహించడం ప్రోమోలో చూపించారు.

విజయ్ దేవరకొండ ను నువ్వు సెక్స్ లో పాల్గొన్నది ఎప్పుడూ అని కరణ్ అడిగితే, విజయ్ దాటవేయాలని ఎబార్ట్ (abort) అంటే, అనన్య మాత్రం ‘ఊహించి చెప్పనా, ఈ ఉదయం’ అనేసింది. ‘పబ్లిక్ ప్లేస్ లో శృంగారంలో పాల్గొన్నావా?’ అనే ప్రశ్నకు కారులో చేశాననీ, తప్పని పరిస్థితులో అలా చేయాల్సి వచ్చిందనీ కన్నుగీటుతూ అన్నాడు విజయ్. ముగ్గురు పాల్గొనే శృంగారం గురించి కూడా కరణ్ అడిగితే లేదంటూ, అలా చేయడానికైతే ఏ ఇబ్బంది లేదని కూడా బదులివ్వడం ఆ ప్రోమోలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తోంది చిత్రబృందం.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

SHARE