హాస్పటల్ లో చేరిన హీరో శ్రీవిష్ణు

హీరో శ్రీవిష్ణు హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటూ వస్తుండగా.. తాజాగా అతడి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చేర్పించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీ విష్ణు హాస్పటల్ లో చేరారనే విషయం తెలిసీ సన్నిహితులు , అభిమానులు కాస్త ఆందోళనలో ఉన్నారు. కాగా దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీ విష్ణు.. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హీరోలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ.. పలు సినిమాలు కూడా చేస్తున్నారు. అతను ఎంచుకున్న సినిమాలు, కథలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. తాజాగా శ్రీవిష్ణు చేస్తున్న కొత్త సినిమా అల్లూరి. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు.

SHARE