సీతారామం ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ కు ఆడియన్స్ రాక పోవడం తో చిత్రసీమ అంత షాక్ లో పడింది. ఓటిటి లు కారణంగానే థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదని భవిస్తూ వచ్చారు. కానీ నిన్న శుక్రవారం విడుదలైన బింబిసార , సీతారామం చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టడం చిత్రసీమకు ఊపిరి పోసినట్లు అయ్యింది. ఈ రెండు సినిమాల టాక్ బాగుండడం తో జనాలు థియేటర్స్ కు పరుగులు పెడుతుండడం తో మళ్లీ కళ వచ్చినట్లు అయ్యింది.

ఇక మహానటి ఫేమ్ దుల్క‌ర్ స‌ల్మాన్‌ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్షన్లో వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌ వారు నిర్మిస్తున్న చిత్రం సీతారామం. ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టింది.

ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే..

నైజాం – రూ. 54 ల‌క్ష‌లు

సీడెడ్ – రూ. 16 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్ష‌లు

ఈస్ట్ – రూ. 15 ల‌క్ష‌లు

వెస్ట్ – రూ. 8 ల‌క్ష‌లు

గుంటూరు – రూ. 15 ల‌క్ష‌లు

కృష్ణ – రూ. 13 ల‌క్ష‌లు

నెల్లూరు – రూ. 5 ల‌క్ష‌లు

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. షేర్ వ‌సూళ్ల పరంగా చూస్తే రూ. 1.50 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 ల‌క్ష‌లు ఇత‌ర భాష‌ల్లో రూ. 35 ల‌క్ష‌లు.. ఓవ‌ర్ సీస్ రూ. 1.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వచ్చాయని సమాచారం.

SHARE