మళ్లీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న భారతీయుడు 2

డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా సీక్వెల్ ను మొదలుపెట్టినప్పటి డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదలైంది.

తాజాగా నేడు భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం జరిగింది. భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో కమల్ హాసన్ పాల్గొనకపోవడం విశేషం. సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీనిని దిల్ రాజు నిర్మిస్తుండగా..కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

SHARE