విడాకుల ఫై ఫస్ట్ టైం నోరువిప్పిన సమంత

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య – సమంతలు కొంతకాలం కాపురం చేసి..ఆ తర్వాత ఇష్టపూర్తిగా విడిపోయారు. వీరు విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. ఎందుకు విడిపోతున్నారో చెప్పకుండా..విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి ఎవరికీ వారే అయిపోయారు. ప్రస్తుతం ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీ గా ఉన్నారు. అయితే అభిమానుల్లో మాత్రం వీరు ఎందుకు విడిపోయారో అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. తాజాగా సమంత విడాకుల ఫై ఫస్ట్ టైం నోరువిప్పింది.

తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సమంత.. నాగ చైతన్యతో విడాకుల గురించి స్పందించింది. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది..? అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. విడాకుల తరువాత చాలా కష్టంగా మారిందని.. అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానంటూ సమంత రిప్లై ఇచ్చింది. తామిద్దరం విడిపోవడం సామరస్యంగా జరగలేదని.. వీడిపోయిన తరువాత చాలా మనోవేదనకు గురైనట్లు చెప్పుకొచ్చింది చెన్నై బ్యూటీ. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సామరస్యం లేదని.. భవిష్యత్‌లో ఆ పరిస్థితి రావచ్చేమోనని అంది.

చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడుతూ.. ‘నేను విడాకులు తీసుకున్న తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను వెల్లడించి విడిపోయా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు..’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. విడాకుల కోసం రూ.250 కోట్లు భరణం తీసుకుందని వచ్చిన వార్తలపై కూడా సమంత సమాధానం ఇచ్చింది. ‘నాకు భరణంగా రూ.250 కోట్లు వచ్చిందని పుకార్లు వచ్చాయి. అయితే అది ఎంత అబద్దామో మీడియానే గ్రహించింది. చివరికి వాటంతట అవే ఆగిపోయాయి..’ అంటూ ఆమె చెప్పింది.

SHARE