నిర్మాత శేఖర్ రాజుపై కేసు పెట్టిన రామ్ గోపాల్ వర్మ..

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..ఈరోజు పంజాగుట్ట లో నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు పిర్యాదు చేసారు. వర్మ రీసెంట్ గా ‘లడ్కీ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ తెలుగులో అమ్మాయి పేరుతో సినిమా చేసారు. ఈ సినిమా విడుదల కాగానే..నిర్మాత శేఖర్ రాజు తాను నిర్మించిన ఓ సినిమాకు ఆర్జీవీ డబ్బులు ఇవ్వలేదని.. ఈ మూవీ నిలిపివేయాలంటూ కోర్ట్ ను ఆశ్రయించడంతో అమ్మాయి సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలిపి వేయాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది.

దీనిపై వర్మ ..నిర్మాత శేఖర్ రాజుపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సినిమాను నిలిపివేశారని సీఐ హరీశ్ చంద్రారెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వర్మ మాట్లాడుతూ… శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. ‘లడ్కీ’ సినిమాపై తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని తెలిపారు. సినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకున్నారని… సినిమా ఆగిపోతే అందరికీ నష్టమేనని చెప్పారు.

సినిమాలపై కేసులు వేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇది నా సినిమాల విషయంలోనే కాకుండా అందరికీ జరుగుతోంది. సినిమాను ఆపడం అనేది బ్యాడ్ థింగ్. ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వద్దని పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం కలిగిందో వారందరూ కూడా శేఖర్ రాజుపై కేసులు పెడతారు. చాలా సీరియస్‌గా ఫైట్ చేయబోతున్నాం అని వర్మ అన్నారు.

SHARE