రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ రిపోర్ట్

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రవితేజ , దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ జంటగా నూతన డైరెక్టర్ శరత్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ , నరేష్ ,తనికెళ్ల భరణి పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసారు.

ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడని సెన్సార్ వాళ్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వాధికారి పాత్రను పాజిటివ్‌గా చూపించడం బాగుందున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర మినహా మిగతావి అవినీతి పాత్రల్లో చూపించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది చక్కగా పిక్చరైజ్ చేసినట్టు సెన్సార్ వాళ్లు చెప్పిన ఇన్నర్ టాక్.

1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

SHARE